ఘనంగా చిన్నికృష్ణన్ ఇన్నోవేషన్ అవార్డుల ప్రదానోత్సవం

Sakshi 2018

కొరుక్కుపేట: మద్రాసు మేనేజ్మెంట్ అసోషియే షన్ (ఎంఎంఏ), కెవిన్కేర్, సంయుక్త ఆధ్వర్యంలో T వ ఎడిషన్ చిన్నికృష్ణన్ ఇన్నోవేషన్ అవార్డు - 2018 ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. స్థానిక కామరాజర్ అరంగం వేదికగా జరిగిన కార్యక్రమంలో కెవిన్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీకే రంగనాథ్, మద్రాసు మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.రామ్ కుమార్ ఆధ్య క్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీవీఎస్ సుందరం అయ్యర్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సురేష్ కృష్ణన్ పాల్గొని ఇన్నోవేషన్ కేటగిరిలో ముగ్గురు ఔత్సాహిక వేత్తలను అవార్డుల తో సత్కరించారు. ఇందులో సైబర్ నోయిడా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు టీఎం వీర బాబు మినియన్ ల్యాబ్స్ ఇండియాట్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు గోకుల్ శ్రీనివాస్, రోప్. ప్రొడక్షన్ సెంటర్ డైరెక్టర్ ఎం మురుగేసన్ లను చిన్నక్రిష్ణన్ ఇన్నోవేషన్ అవార్డులతో సత్క రించారు. అలాగే గ్రేట్ ఐడియాస్ కేటగిరి కింద వ్యక్తిగత ఆవార్డులు డాక్టర్ ఎస్. రమణి, కె.మో హ రాజ్, శరణ్య శ్రీరామ్ లకు అందించారు. సురే ష్ కృష్ణన్ మాట్లాడుతూ వినూత్న ఆవిష్కరణలకు
నాంది పలుకుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీకే రంగనాథ్ మాట్లాడుతూ చిన్నికృష్ణన్ స్మారకార్థం ప్రతిఏడాది ఇన్నోవేషన్ అవార్డులు అందిస్తున్నా మని అవార్డులు అందుకున్న వారికి ప్రత్యేక అభి నందనలు తెలిపారు.

About MinionLabs

MinionLabs is the World Leader in Energy Efficiency for Cities, Businesses, and Consumers for the Internet of Things. Our Artificial Intelligence-based products, systems, and services enable our users to be energy efficient, reduce carbon footprint, prevent climate change and make people’s lives safer and comfortable, and businesses more productive and cities more livable in a sustainable way. Visit us at www.minionlabs.tech